హిందువులు ఆచరించాల్సిన షోడశ సంస్కారాలు
షోడశ సంస్కారాలు
హిందూ సంప్రదాయాల్లో సంస్కారాలు ఆగమ సంబంధమైన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతం వివిధ దశలలో జరుపబడుతాయి. స్త్రీ పురుష సమాగమము మొదలుకొని. జననము, మరణం. తదనంతరము ఆత్మ పరలోక శాంతినొందుట వరకు సంస్కారములు జరుపబడును.
సంస్కారములు మొత్తం 16. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు ), జననాంతర సంస్కారములు (పుట్టిన తరువాత ). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు. ఆపై పదమూడు సంస్కారములు జననాంతర సంస్కారములు.


Comments
Post a Comment