నామ నక్షత్రముల వివరణ
నామ నక్షత్రములు
చూ - చే - చో - ల = అశ్విని
లీ - లు - లే - లొ = భరణి
ఆ - ఈ - ఊ - ఏ = కృత్తిక
ఓ - వా - వీ - వు = రోహిణి
వే - వో - కా - కి = మృగశిర
కూ - ఘ - జ్ఞ - ఛ = ఆరుద్ర
కే - కో - హా - హి = పునర్వసు
హూ - హే - హో - డ = పుష్యమి
డీ - డూ - డే - డో = ఆశ్రేష
మా - మీ - మూ - మే = మఖ
మో - టా - టీ - టు = పుబ్బ(పూర్వఫల్గుని)
టే - టో - పా - పి = ఉత్తర(ఉత్తరఫల్గుణి)
పూ - ష - ణా - ఠ = హస్త
పే - పో - రా - రి = చిత్త
రూ - రే - రో - త = స్వాతి
తీ - తూ - తే - తొ = విశాఖ
నా - నీ - నూ - నే = అనురాధ
నో - యా - యీ - యు = జ్యేష్ఠ
యే - యో - బా - బి = మూల
బూ - ధా - భా - ఢ = పూర్వషాడ
బే - బో - జా - జీ = ఉత్తరాషాడ
జూ - జే - జో - ఖ = శ్రవణం
గా - గీ - గూ - గె = ధనిష్ఠ
గో - సా - సీ - సు = శతభిషం
సే - సో - దా - ది = పూర్వభాద్ర
దు - శం - ఝా - థ = ఉత్తరాభాద్ర
దే - దో - చా - చి = రేవతి
అశ్విన్యాది రేవత్యాంతం 27 నక్షత్రములలో ఒక్కొక్క నక్షత్రమునకు నాలుగు పాదములు (4చరణములు )నాలుగు అక్షరములుగా నామధ్యక్షరములుగా జ్యోతిశాస్త్రములో నిర్ణయింపబడియున్నవి. ఇవి క్రమముగా ప్రథమక్షరము ప్రథమ పాదము, ద్వితియాక్షరము ద్వితీయ పాదము, తృతీయక్షరము తృతీయ పాదము, చతుర్దాక్షరము చతుర్ద పాదములని తెలియవలెను.
ఈ భూమండలములో మానవులాదిగా గల అనేక నామముల యొక్క నామాద్యక్షర (నక్షత్ర పాద ) నిర్ణయము ననుసరించి వారివారికి ఆయా భూత భవిష్యద్వర్తమాన ఫలితాంషములు తెలిసికొనుటకు ఆధారమైయున్నది. ఆవిధముగా నిర్ణయింపబడియున్న నామాద్యక్షరము (నక్షత్ర పాదము ) గుర్తించే ముందు శాస్త్రోక్తముగా వర్ణ ( అక్షర ) పరిశీలన, విమర్శన చేయవలెను.

Comments
Post a Comment