తారలకు అధిపతులు - శాంతులు

 తరాధిపతులు-శాంతులు


1. జన్మతారా :

          మంచిది కాదు - అధిపతి సూర్యుడు - మనస్థాపాన్ని కలిగిస్తాడు - వాహనం నెమలి - తోటకూర దానం చేయాలి - నక్షతము నందలి మూడవ పాదం దోషభూయిష్టమయినది. బాధలు కలిగించును.

2. సంపత్తార :

       మంచిది - బుధుడు అధిపతి - వాహనం గుర్రం - దోషం లేదు - దానం ఇవ్వనవసరం లేదు - ధన లాభం - సుఖం కలిగించును.

3. విపత్తార :

            మంచిది కాదు - అధిపతి రాహువు - వాహనము మేక - బెల్లం దానం చేయవలెను - నక్షత్రమందలి మొదటి పాదం దోషభూయిష్టమైనది. కలహముతో కష్టములు ఎదురుకావచ్చు. అపార్థం చేసుకొనే అవకాశం - కార్యహాని కలుగుతుంది.

4. క్షేమతార :

          మంచిది - గురువు అధిపతి - వాహనం ఏనుగు - దోషాలు లేవు - శాంతులు , దానం ఇవ్వనవసరంలేదు - మనోధైర్యం - కార్యసిద్ది - ప్రజాక్షేమం - సుఖం కలుగును.

5. ప్రత్యక్తార :

        మంచిది కాదు - అధిపతి కేతువు - వాహనం కాకి - ఉప్పును దానం చేస్తే దోషాలు తొలగును - నక్షత్రమునందలి నాలుగో పాదం దోషభూయిష్టమైనది - కార్యహానికి అవకాశం ఉంది.

6. సాధనతార :

        మంచిది - చంద్రుడు అధిపతి - వాహనం నక్క - కీర్తికారకుడు - దోషాలు లేవు - శాంతులనవసరము - పరోపకారం చేస్తారు. సాధనమున పనులు సానుకూలమవుతాయి - సంపదలు - కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.

7. నైధనతార :

        మంచిది కాదు - అధిపతి శని - ధననష్టకారకుడు - వాహనం సింహం - యుద్ధభీతి కలుగుతుంది - నువ్వులతో గూడ బంగారం దానమివ్వాలి - నక్షత్రమునందలి రెండోపాదం దోషభూయిష్టమైనది - అలసట, తిప్పటం, ధననష్టం.

8. మిత్రతార :

                 మంచిది - తారాధిపతి శుక్రుడు - సుఖసంతోషములకు కారకుడు - వాహనం గరుత్మంతుడు - స్త్రీలకు సల్లాపము చేకూరుతుంది - దోషాలు లేవు - దానమక్కరలేదు - కళాప్రీతి చేకూరును - విశేష శుభం కలుగును.

9. పరమమిత్రతార :

              మంచిది - తారాధిపతి కుజుడు - హంస వాహనము - దోషములేదు - దానం అనవసరము. కొంచెం కష్టాలతో కార్యం సానుకూలమవుతుంది - ధనలాభం కలుగును.

Comments

Post a Comment

Popular posts from this blog

పంచాంగం 22-05-2022

నేటి పంచాంగం 21-05-2022

నేటి పంచాంగం 29-05-2022